మరికాసేపట్లో ప్రగతి భవన్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మరికాసేపట్లో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రారంభం కాబోయే ఈ సమావేశానికి తెలంగాణ మంత్రులు అందరూ హాజరు కానున్నారు. ఈ మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగ నియామకాలు, కృష్ణా జల వివాదాల అంశాలు ప్రధాన ఎజెండాగా కానున్నాయి.
రిజిస్ట్రేషన్ ఛార్జ్ లు, భూముల విలువ పెంపు, కరోనా పరిస్థితిలు, వ్యవసాయం మరియు పల్లె, పట్టణ ప్రగతిల పై చర్చ జరుగనుంది. అలాగే వీలైనంత త్వరగా 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రకటనపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఈ ఉద్యోగాల పై ప్రకటన కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే శాఖల వారీగా ఖాళీల సంఖ్యను గుర్తించిన తెలంగాణ ఆర్థిక శాఖ అధికారులు సమగ్రమైన నోట్ను రూపొందించారు. దీనిపై చర్చించనున్న తెలంగాణ కేబినెట్ ఉద్యోగాల భర్తీ విషయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఫైనల్ చేయనుంది. కాగా ఇటీవలే సిఎం కెసిఆర్.. 50 వేల ఉద్యోగాలను భారతి చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.