అమర వీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణ కేసీఆర్ కుటుంబం వంశం అయిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..ఈరోజు దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న కిషన్ రెడ్డి..టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు..ఈ ఉప ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు ఏమి తీర్పు ఇస్తారని తెలంగాణ అంతా ఆసక్తితో ఉందన్నారు మంత్రి కిషన్ రెడ్డి..తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడుని ముఖ్యమంత్రినీ చేస్తా అన్నడు.. కానీ రెండు సార్లు కెసిఆరే ముఖ్యమంత్రి అయిండని కిషన్ ఆరోపించారు..
బిజెపి లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని..కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి బిజెపి సపోర్ట్ తో తెలంగాణ తెచ్చుకున్నాం అన్నారు కిషన్ రెడ్డి..నీళ్లు నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువతను కేసీఆర్ మోసం చేశాడని..ఉద్యోగాలు ఇవ్వడం లేదు కానీ.. కెసిఆర్ మాత్రం తన కుటుంబానికి మాత్రం పదవులు ఇస్తున్నారు అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు..ఇప్పుడు దుబ్బాక ప్రజలకు మంచి నిర్ణయం తీసుకునే అవకాశం వచ్చిందని..TRS కు షాక్ ట్రీ్మెంట్ ఇచ్చే అవకాశం మీకు వచ్చిందని ఆలోచించండన్నారు మంత్రి..బిజెపి పువ్వు గుర్తుకు ఓటు వేయలని విజ్ఞప్తి చేశారు..కేసీఆర్ సీఎం అయిన తర్వాత పావలా వడ్డీ మహిళలకు ఇవ్వడం లేదని… రైతులకు పావలా వడ్డీ ఇవ్వడం లేదన్నారు.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని ఓట్లు వేసుకున్నాడని..డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదని కిషన్ రెడ్డి ఎద్దెవేశారు..అకాల వర్షాలతో పంట నష్ట పోతే కూడా పంట కు ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదన్నారు..కేజీ బియ్యంకు 30 రూపాయలు కేంద్రంలో మోడీ ఇస్తున్నారు..కెసిఆర్ ఇచ్చేది 2 రూపాయలే మాత్రమే అని కెసిఆర్ పాలనలో తెలంగాణ అప్పుల పాలు అయిందన్నారు..