నేడు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు.. ప్రముఖుల శుభాకాంక్షలు

-

ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం బర్త్ డే ఘనంగా నిర్వహించడానికి బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ కటౌట్లు, హోర్డింగులతో తెలంగాణ అంతా గులాబీ మయమైపోయింది.

జిల్లాల్లో నిర్వహించే కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో మంత్రులు పాల్గొననున్నారు. కేక్ కట్ చేసి కార్యకర్తల్లో జోష్ నింపనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అభిమానులు కేసీఆర్​కు ప్రత్యేక కానుకలు రూపొందిస్తున్నారు. అందులో ఒకటి వేరుసెనగ, ఉలవలు, ఉప్పు, రంగులతో కేసీఆర్​ చిత్రపటాన్ని రూపొందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు సీఎం పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, ప్రజల అభిమానం, ఆశీస్సులతో కేసీఆర్‌ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news