పాల మీద పన్ను, స్మశానాల మీద పన్ను.. ఇదేనా టీమిండియా అంటే : సీఎం కేసీఆర్‌

-

ప్రగతి భవన్‌లో నేడు సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలపై పెరిగిన పన్నుల భారంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనిపై పన్నులు విధిస్తారు? ప్రజలు భరించగలరా? ఈ విషయాన్ని నీతి ఆయోగ్‌లో చర్చించారా? ఇదేనా సహకార స్ఫూర్తి? అని మండిపడ్డారు సీఎం కేసీఆర్‌. ‘‘దేనిపై జీఎస్టీ వేశారో కూడా మాకు తెలీదు. బయటకు వచ్చాక తెలిసిందని, పాల మీద పన్ను, స్మశానాల మీద పన్ను.. ఇదేనా టీమిండియా అంటే? ఈ కారణాల వల్లనే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా అని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఇలాగైనా మెజార్టీ ప్రజల భావాలు ప్రధానికి అర్థమవుతాయని ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నా అని వివరించారు సీఎం కేసీఆర్‌. ఏ దేశంలోనైనా ‘జాతి పిత’ అని పేరు పెట్టుకున్న వ్యక్తిని.. అహింసామార్గంలో స్వాతంత్ర్యం తెచ్చిన వ్యక్తిని అవమానిస్తారా? అని అడిగారు సీఎం కేసీఆర్‌.

CM KCR in Delhi to pursue paddy issue

ప్రధాన మంత్రేమో నీతి ఆయోగ్ లోగోలో గాంధీ కళ్లద్దాలు పెడితే.. బీజేపీ సంఘాలేమో గాంధీని దూషిస్తుంటారు.. గాంధీకి లేని అవలక్షణాలు ఉన్నట్లు చెప్తున్నారు అని సీఎం కేసీఆర్ అన్నారు‌. ఇలా ఎక్కడైనా ఉంటుందా? అని సీఎం
కేసీఆర్‌ ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్లు ధరలు పెంచి ప్రజలపై భారం మోపిందే కాకుండా.. ఇప్పుడు కొత్తగా ఉచితాలు బంద్ చెయ్యాలని చెప్తున్నారు. రైతాంగం బాధలో ఉందని, ఒక ఎకరమో గుంటనో భూమి ఉన్న రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుందన్న ఉద్దేశ్యంతో రైతు బంధు ఇస్తే అది ఉచితమా? అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవి ఉచితాలు అయితే ఎన్పీయేలు ఎందుకు ఇస్తున్నారు? అని సీఎం కేసీఆర్‌ అడిగారు. ఈ విషయం దేశానికి చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news