ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంకాగానే మొదట స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కాగా నేడు.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ఆర్థిక నివేదికను ప్రవేశపెట్టనున్నారు. ఎక్సైజ్ పాలసీ, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం, బాలికలు-మహిళల మీద అఘాయిత్యాలపై ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా సోమశిల హైలెవల్ ప్రాజెక్టు నిర్మాణంపై టీడీపీ సభ్యులు అధికార పక్షాన్ని ప్రశ్నించనుంది.
ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ సభాహక్కుల నోటీసు ఇచ్చింది. శాసనసభ కార్యదర్శికి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నోటీసులు అందజేశారు. నిన్న శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి.. బఫూన్‌లంటూ అభ్యంతరకర భాష వాడటంపై నోటీసులు ఇచ్చారు. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి సీఎం జగన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని నోటీసులో టీడీపీ పేర్కొంది. ఇక ఈ రోజుతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.