ఈనెల 11న హైదరాబాద్ కి తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే

-

ఈనెల 11న హైదరాబాద్ రానున్నారు తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్ మానిక్ రావ్ థాక్రే. 11,12 తేదీల్లో రెండు రోజుల పాటు పార్టీ సమావేశాలతో బిజిబిజీగా ఉండనున్నారు. 11 తేదీన ఉదయం 10 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు థాక్రే. 11 గంటలకు ఏఐసీసీ సెక్రటరీ లతో సమావేశం అవుతారు. 11:30 గంటలకి పీసీసీ అధ్యక్షుడితో సమావేశం కానున్నారు థాక్రే.

అనంతరం 12 గంటలకు సీఏల్పీ నేత తో సమావేశం అవుతారు. 12:30 గంటలకు సీనియర్ నేతలు ,వర్కింగ్ ప్రెసిడెంట్ లతో సమావేశం కానున్నారు. ఇక లంచ్ అనంతరం 3 గంటలకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. 4 గంటలకు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం.. 5 గంటలకు పీసీసీ అధికార ప్రతినిధులతో సమావేశం అవుతారు.

ఆ మరునాడు 12 వ తేదీన ఉదయం 10:30కి డీసీసీ అధ్యక్షులతో సమావేశం..11:30 గంటలకు అనుబంధ సంఘాల అధ్యక్షులతో భేటీ అవుతారు. 12:30 గంటలకు పార్టీలోని వివిధ సెల్స్ ,డిపార్ట్మెంట్ అధ్యక్షులతో సమావేశం అవుతారు. ఇక 12వ తేదీన సాయంత్రం 4 గంటలకు తిరిగి ఢిల్లీ వెల్లనున్నారు థాక్రే.

Read more RELATED
Recommended to you

Latest news