చనిపోయిన వాళ్లు తిరిగి రావడం అసాధ్యం..కానీ చనిపోయారు అనుకుని..పూర్తిగా నమ్మేశాక ఆఖరి క్షణంలో వారు బతికేఉన్నారు అని తెలిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి.. తమిళనాడులో ఓ వ్యక్తి చనిపోయాడనుకోని ఇంట్లో వాళ్లు అంత్యక్రియల ఏర్పాట్లు కూడా చేశారు. తులసినీళ్లు నోట్లో పోయగానే లేచాడు.. శవం లేచిందేంటా అని అందరూ షాక్ అయ్యారు. నిజానికి ఆ వ్యక్తి చనిపోలేదు..అలాంటిదే ఈరోజు జరిగిన ఘటన కూడా.. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్.. చనిపోయిందనుకోని శ్మశానవాటికకు కూడా తీసుకెళ్లారు.. సడన్‌గా ఆమె కళ్లు తెరిచింది..
చనిపోయిందనుకున్న మహిళ అంత్యక్రియల వేళ కన్ను తెరిచింది. ఈ పరిణామం కుటుంబసభ్యులతో పాటు బంధువులను ఆశ్చర్యానికి గురి చేసింది. బతికే ఉన్న ఆ మహిళను ఇంటికి తీసుకెళ్లి టీ తాగించారు బంధువులు. అయితే, మరుసటి రోజే ఆ మహిళ మరణించింది.
ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరిగింది.. యూపీలోని ఫిరోజాబాద్ జిల్లా జస్రానా పరిధిలోని బిలాస్‌పూర్‌కు చెందిన హరిభేజీ అనే 81 ఏళ్ల మహిళ డిసెంబర్ 23న అస్వస్థతకు గురైంది. కుటుంబసభ్యులు ఆమెను ఫిరోజాబాద్‌లోని ట్రామా సెంటర్‌లో చేర్పించారు. మంగళవారం ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు చెప్పారు..వైద్యపరంగా మరణించినట్లేనని, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకోవచ్చునని వైద్యులు చెప్పారు.. దీంతో కుటుంబసభ్యులు ఆమె చనిపోయిందనుకోని హరిభేజిని ఇంటికి తీసుకొచ్చారు. బంధువులకు సమాచారం అందించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తీరా.. శ్మశానవాటికకు తీసుకెళ్తున్న సమయంలో ఆమె కళ్లు తెరిచింది. బంధువులు అది గుర్తించి ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. సపర్యలు చేశారు. స్పూన్ సాయంతో ఆమెకు టీ కూడా తాగించారు.
అయితే.. ఆమె ఇంటికి వచ్చాక.. 24 గంటలు బతికింది..డాక్టర్లు చనిపోయిందని డిక్లేర్ చేసిన తర్వాత 24 గంటల పాటు బతికిన హరిభేజి.. మరుసటి రోజు మరణించింది. బుధవారం (జనవరి 4) సాయంత్రం హరిభేజి కుమారుడు సుగ్రీవ్ సింగ్ ఆమెకు అంత్యక్రియలు నిర్వహించాడు. అస్సలు ఈ బాధ ఇంకా ఘోరంగా ఉంటుంది. చనిపోయిన తల్లి బతికే ఉందన్న సంతోషం ఒక్కరోజు కూడా లేకుండా పోయింది.