మరోసారి తెలంగాణలో భారీ కరోనా కేసులు నమోదయ్యాయి. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగతూ వస్తోంది. దేశవ్యాప్తంగా కూడా కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయితే తాజాగా రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 923 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,18,290కి చేరింది. తాజాగా 739 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 8,09,009 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ కారణంగా మొత్తం 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,170 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో కొవిడ్ మరణాల రేటు 0.50శాతం ఉండగా.. రికవరీ రేటు 98.87శాతంగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. శుక్రవారం ఒకే రోజు 40,593 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు పేర్కొంది. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 366, రంగారెడ్డిలో 79, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 59, నల్గొండలో 51, పెద్దపల్లిలో 34, మంచిర్యాలలో 30, నిజామాబాద్‌లో 28, యాదాద్రి భువనగిరిలో 24, హనుమకొండలో 22, కరీంనగర్‌లో 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.