తెలంగాణాలో మరింత తగ్గిన కేసుల నమోదు…894 మాత్రమే !

-

తెలంగాణాలో కరోనా కేసుల నమోదులో క్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. కొన్ని రోజుల ముందు దాకా రోజుకు రెండు వేల కేసులు దాకా నమోదు కాగా ఇప్పుడు ఆ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా తెలంగాణా వైద్యారోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 894 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి దాకా నమోదయిన కేసుల సంఖ్య 92,255కు చేరింది. ఇక 24 గంటల్లో 2,006 కరోనా నుండి కోలుకోగా ఇప్పటిదాకా రాష్ట్రంలో కరోనా సోకి కోలుకున్న వారి సంఖ్య 70,132కు చేరింది.

ఇక గడిచిన 24 గంటల్లో పది మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 703కు చేరింది. ఇక ప్రస్తుతానికి తెలంగాణాలో 21,420 కేసులు యాక్టివ్ గా ఉండగా, 14,404 మంది హోం ఐసోలేషణ్ లో ఉన్నారు. అయితే కేసుల నమోదులో తగ్గుదలకి కారణం టెస్ట్ లు తక్కువగా చేయడం అనే చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 8,794 టెస్ట్ లు మాత్రమె చేయడంతో కేసులు కూడా తక్కువ నమోదయ్యాయి. ఇక జీహెచ్ఎంసీలో కూడా కేసుల నమోదు తక్కువగానే అయ్యాయి. తాజాగా ఇక్కడ 147 కేసులు నమోదయ్యాయి, ఆ తరువాత రంగారెడ్డి జిల్లలో 85 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో కేసులు కాస్త తక్కువగానే నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news