అసలు వాట్సాప్ వాడితే సేఫ్ గా ఉంటామా…? కష్టమే అంటున్నాయి నివేదికలు. వాట్సాప్ లో మన డేటా ఎంత మాత్రం భద్రం కాదు అనే విషయాన్ని నివేదికలు చెప్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడు నిద్రపోతున్నాం, ఎక్కడ ఉన్నాం, ఏ వస్తువులు వినియోగిస్తున్నాం వంటి అన్ని విషయాలను వాట్సాప్ తెలుసుకుంటుంది. బయటి యాప్స్ కి వాట్సాప్ లో అనుమతి ఇస్తున్నారు.
ఫేస్బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ ఇప్పుడు వినియోగదారుల డేటాకు ఎంత మాత్రం కూడా రక్షణగా లేదని తాజాగా వచ్చిన నివేదికలు స్పష్టం చేసాయి. బయటి యాప్స్ వాట్సాప్‌లోని “ఆన్‌లైన్” సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా మన ఇంటర్నెట్ వాడకం సహా అన్ని విషయాలను బయటపెడుతున్నాయి. కాని వాట్సాప్ యాజమాన్యం మాత్రం అంత సీన్ లేదని అంటుంది.