బిగ్ బ్రేకింగ్ : ఒక్కరోజులోనే తెలంగాణలో 730 కరోనా కేసులు..!

-

కరోనా మహమ్మారి తెలంగాణలో తీవ్రంగా వ్యాపిస్తుంది.. దీని ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పరీక్షల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. . దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మాస్క్ లేనిదే బయట అడుగుపెట్టలేకపోతున్నారు మనుషులు. అధికారులు ఈ మహమ్మరిని అరికట్టేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నారు. అయినా దీని తీవ్రత మాత్రం తగ్గట్లేదు. కాగా, ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 730 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అలాగే మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,802కు చేరింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 210 మంది మరణించారు. ప్రస్తుతం 3,861 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు వరకు 3,731 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news