తెలంగాణ‌లో కొత్త‌గా 357 క‌రోనా కేసులు

-

ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే కొత్త కొత్త వేరియంట్లతో ప్రజలపై దాడి చేస్తున్న కరోనా మహమ్మారి కేసులు దేశవ్యాప్తంగా భారీగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా.. తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 24,399 శాంపిల్స్ పరీక్షించగా, 357 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 165, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 31, రంగారెడ్డి జిల్లాలో 32 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 501 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అదే సమయంలో 440 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు.

Corona Virus in India: देश में पिछले 24 घंटे में कोरोना के 3303 नए मामले,  एक्टिव केस बढ़कर 17 हजार हुए - corona virus in india 3303 new covid 19  cases recorded Delhi maharashtra ntc - AajTak

తెలంగాణలో ఇప్పటివరకు 8,31,622 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,24,800 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,711 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది మృతి చెందారు. ఇదిలా ఉంటే.. వర్షాకాలం కారణంగా సీజనల్‌ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. మంకీపాక్స్‌ కేసులు కూడా దేశంలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది

 

Read more RELATED
Recommended to you

Latest news