తెలంగాణలో కరోనా విజృంభణ…3 వేలు దాటిన కేసులు..!

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. తాజాగా బుధవారం నాడు కొత్తగా 129 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 127 కరోనా కేసులు రాష్ట్రానికి చెందినవి కాగా, మరో 2 కరోనా కేసులు వలసకార్మికులకు చెందినవి ఉన్నాయి. అయితే ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఇవాళ 108 మందికి కరోనా సోకింది. అలాగే రంగారెడ్డి, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో 6 చొప్పున.. మేడ్చల్‌, సిరిసిల్ల జిల్లాల్లో రెండేసి కరోనా కేసులు నమోదయ్యాయి. యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఒకటి చొప్పున వెలుగులోకి వచ్చాయి. అలాగే ఇవాళ ఒక్కరోజే కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3020కు చేరుకుంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే 99 మంది మరణించగా 1,556 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,365 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.