వారిని శిక్షించమంటున్న ఎమ్మెల్యే రజిని..!

సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లతో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి కూడా కొందరు పనికట్టుకొని మరీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని. అలాంటి వారిని పట్టుకొని, కఠినంగా శిక్షించాలని సి.ఐ.డి అడిషనల్ డి.జి.పి సునీల్ కుమార్ ని కలిసి ఫిర్యాదు చేశారు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని. ఈ సందర్భంగా సి.ఐ.డి అడిషనల్ డి.జి.పి సునీల్ కుమార్ మాట్లాడుతూ అలాంటి అకౌంట్లను గుర్తించి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియచేశారు.