ఏప్రిల్‌లో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ప్రారంభం

-

రాష్ట్రంలో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఓవైపు పోలీసులు.. మరోవైపు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. అయినా రోజు ఏదో రకంగా సైబర్ కేటుగాళ్లు అమాయకులకు వల వేస్తూనే ఉన్నారు. వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు.. వారి నేరాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేస్తోంది.

బంజారాహిల్స్​లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంగా ఏర్పాటవుతున్న ఈ బ్యూరో ఏప్రిల్​లో అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ టీఎస్సీఎస్బీలో హెల్ప్ లైన్, రాష్ట్ర సైబర్ కంట్రోల్ రూమ్, కేంద్ర పర్యవేక్షణ విభాగం, డేటా అగ్రిగేషన్ అండ్ అనాలసిస్ యూనిట్, థ్రెట్ ఇంటలిజెన్స్ యూనిట్, ఫోరెన్సిక్ సపోర్ట్ యూనిట్ ఉంటాయి.

కేసుల దర్యాప్తు, న్యాయ విచారణకు సంబంధించి ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్ సపోర్ట్ యూనిట్ ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. వీటికి అనుబంధంగా నియామక, శిక్షణ విభాగం పనిచేస్తుంది. బ్యూరో పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యాక సీఐడీ దగ్గరున్న సైబర్ నేరాల కేసులు ఇక్కడికి బదిలీ అవుతాయి. సైబర్ నేరాలకు సంబంధించి ప్రస్తుతం అన్ని జిల్లాల్లో సమన్వయ కేంద్రాలున్నాయి. ఇవి బ్యూరోకు అనుసంధానమవుతాయి. వివిధ కేసులు దర్యాప్తు తీరుతెన్నులపై ప్రాసిక్యూషన్ సపోర్ట్ విభాగం క్షేత్రస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది. ప్రభుత్వం ఈ బ్యూరోకు ఇటీవల 500 పోస్టులు కేటాయించింది.

Read more RELATED
Recommended to you

Latest news