నేటి నుండి తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు

-

నేటి నుండి తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి అలానే 14వ తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అలానే మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్స్ లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 102 సెంటర్లలో పరీక్ష జరగనుంది. అందులో 79 తెలంగాణలో ఉండగా 23 పరీక్ష కేంద్రాలు ఏపీలో ఉండనున్నాయి. మొత్తం 1,43,165 విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని అంచనా వేస్తున్నారు.

పరీక్ష కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు మాస్కులు ఖచ్చితంగా ధరించాలని అలానే ఫిజికల్ డిస్టెన్స్ కూడా తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. సానిటైజర్ వాడాలని కూడా అధికారులు సూచనలు చేశారు. గంటన్నర ముందు నుండే పరీక్ష హాల్లోకి విద్యార్థుల అనుమతి ఇవ్వనున్నారు. అలానే గతంలో లానే నిమిషం అలస్యంమైనా నో ఎంట్రీ రూల్ అమలు చేయనున్నారు. ఆన్లైన్ ద్వారానే ఈ పరీక్ష నిర్వహించానున్నారు. పాజిటివ్ ఉంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని, అలా పాజిటివ్ ఉన్న విద్యార్థులకు మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్టు చెబుతున్నారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news