సీనియర్ ఎన్టీఆర్ మనవడు నందమూరి తారకరత్న సంచలన ప్రకటన చేశాడు. ఏపీ నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని నందమూరి తారకరత్న అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రులో ఆయన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య అధ్యక్షతన జరిగిన సభలో తారకరత్న ప్రసంగించారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. తెదేపాను అధికారంలోకి తెచ్చేందుకు తాను ఇప్పటినుంచి ప్రజల్లోకి వెళ్లి కృషి చేస్తానన్నారు. చంద్రబాబుకు వెంట ఉండి ప్రజల కోసం పోరాడతానని చెప్పారు. సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ తనకు వీలున్న సమయంలో ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. మహిళలకు ఆస్తి హక్కు తాలుకాలను రద్దుచేసి మండల వ్యవస్థను ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. రాష్ట్రం గత మూడేళ్ల నుంచి క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మాచర్లలో జరిగిన ఘర్షణలు ఇందుకు కారణమన్నారు. ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ కుట్రలతో పాలన చేస్తున్నారని ఆరోపించారు.