అవును ఇప్పుడు తెలంగాణాలో జనం అమ్మో చికెన్ అంటున్నారు. చికెన్ లేకుండా ముద్ద దిగని వాళ్ళు కూడా ఇప్పుడు చికెన్ పేరు వింటే చాలు భయపడిపోతున్నారు. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. ముందు ఖమ్మం జిల్లాకు మాత్రమే సోకిన వైరస్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. దీనితో ప్రజలు ఇప్పుడు చికెన్ తినాలి అంటే చాలు అమ్మో అనే పరిస్థితి తెలంగాణా లో ఏర్పడింది అనేది వాస్తవం.
అసలు ఆ వైరస్ ఏంటో తెలియదు, ఎక్కడ పుట్టిందో తెలియదు, ఏ రూపంలో ఉంటుందో తెలియదు… అటు పశు వైద్య అధికారులకు కూడా ఈ వైరస్ అంతు చిక్కడం లేదు. కోడి ఏ విధంగా చనిపోతుందో తెలియడం లేదు. లక్షల రూపాయలను అప్పు తీసుకొచ్చి పెట్టిన రైతు ఇప్పుడు కళ్ళ ముందు రాలిపోతున్న కోడిని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల ఏపీలోనూ అనేక కోళ్లు మృతి చెందాయని,
అదే వైరస్ ఇప్పుడు తమ ప్రాంతానికి వచ్చిన ఫలితంగానే కోళ్లు మృతిచెంది ఉంటాయని వ్యాపారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనితో చికెన్ షాపులు కూడా తీయలేని పరిస్థితి ఏర్పడింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నాయకులగూడెం, వరంగల్ రూరల్‌కు చెందిన ఖానాపురంలో లక్ష కోళ్ళు చనిపోయాయి. చికెన్ తింటే కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న వదంతులతో.. చాలా మంది మాంసాహారులు చికెన్‌కు దూరంగా ఉన్నారు దీనితో మార్కెట్ భారీగా పడిపోయింది.