ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం మళ్లీ ముదురుతోంది. మొన్నటివరకు ఒకరిపై ఒకరు… మాటల యుద్ధం చేసుకోగా ఇప్పుడు వరుస లేఖలతో మరో యుద్ధానికి తెరలేపాయి రెండు రాష్ట్రాలు. తాజాగా కృష్ణానది యాజమాన్య బోర్డు కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.
పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నీటిని తరలించకుండా ఆపాలని లేఖలో విజ్ఞప్తి చేసింది తెలంగాణ సర్కారు. సాగర్ నీటి అవసరాల కోసం తరలింపు ఆపాలని పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్ పరిమితికి మించి నీరు తీసుకుంటోందన్న తెలంగాణ ప్రభుత్వం… ఏపీ ఇప్పటికే 25 టీఎంసీలు తరలించిందని ఆరోపించింది. నిబంధనల ప్రకారం ఏపీ 10.48 టిఎంసిలు తీసుకోవాలని పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇదే విషయంపై కేంద్ర జల శక్తి శాఖకు కూడా లేఖ రాసింది తెలంగాణ సర్కార్. జల వివాదం విషయంలో… తెలంగాణకు న్యాయం చేయాలని స్పష్టం చేసింది. ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం త్వరగా స్పందించాలని డిమాండ్ చేసింది.