తెలంగాణా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు…!

-

కరోనా వ్యాప్తి నేపధ్యంలో… తెలుగు రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడిక్కడ ప్రజలను కట్టడి చేస్తున్నాయి. వైరస్ వ్యాప్తి మరింతగా పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో లాక్ డౌన్ చేసిన సంగతి తెలిసిందే. అంటువ్యాధుల నియంత్రణ చట్టం -1897, విపత్తు నిర్వహణ చట్టం-2005 కింద లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఒక జీవో విడుదల చేసారు.

అత్యవసర పరిస్థితులు, నిత్యావసరాల కోసం తప్ప ఎవరూ బయటకు రాకూడదు.

బైక్‌పై ఒకరి కంటే ఎక్కువ మంది ఉండకూడదు.

కార్లలో ఇద్దరికి మించి ఎక్కువ మంది ప్రయాణించకూడదు.

సాయంత్రం 7 నుంచి ఉదయం 6 వరకు ఎవరూ బయటకు రాకూడదు.

అత్యవసర వైద్య సేవల అవసరం ఉంటేనే రాత్రి వేళ అనుమతిస్తారు. రాత్రి 06.30 తర్వాత ఆస్పత్రులు, మెడికల్ షాపులు మినహా అన్ని షాపులు మూతపడాలి.

సాయంత్రం తర్వాత కిరాణా షాపులు, ఇతర దుకాణాలు కూడా అందుబాటులో ఉండవు.

నిత్యావసర సరుకుల కోసం వచ్చే వారు తమ నివాసానికి 3 కి.మీ. పరిధిలో మాత్రమే వెళ్లే అవకాశం ఉంటుంది.

లాక్‌డౌన్ సమయంలో బీమా ప్రతినిధులు తమ కార్యకలాపాలు కొనసాగించవచ్చు.

కోవిడ్-19 విధుల్లో ఉన్న వారికి ఈ నిబంధనలు వర్తించవు. వారు ఎక్కడికైనా వెళ్లవచ్చు.

లాక్‌డౌన్ ఆదేశాలను కఠినంగా అమలుచేసేందుకు అక్కడక్కడా పోలిస్ చెక్‌పోస్టులు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news