అర్జున్ కూతురైనా రొమాన్స్, లిప్ కిస్ చేయాల్సిందే అంటున్నారా …?

-

నార్త్, సౌత్ సినిమా ఇండస్ట్రీలలో స్టార్ వారసులు కూడా సినిమాలలోకి వచ్చి స్టార్స్ గా ఒక వెలుగు వెలుగుతున్న చాలా మంది హీరో హీరోయిన్సే ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా స్టార్స్ కూతుళ్ళు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఏదో రెండు సినిమాలు చేసి వెళ్ళలా ఉండరు. అందుకు ఉదాహరణ కమల్ హాసన్ కూతురు శృతిహాస్న్, శ్రీదేవి కూతు జాన్వీ కపూర్, సోనాక్షి సింహా, రాధిక శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ లనే తీసుకోవచ్చు. వీళ్ళంతా స్టార్స్ కూతుళ్ళైనప్పటికి హీరోయిన్ గా మాత్రం ప్రొఫషనల్ గా ఉంటుంన్నారు. హీరోలతో ఘాటు రొమాన్స్, లిప్ కిస్, ఎక్స్‌ఫోజింగ్ ఇలా అన్ని విషయాలలో వృత్తే దైవం అని భావిస్తున్నారు. ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే తప్పదు మరి.

 

వీళ్ళ బాటలోనే సౌత్ స్టార్ యాక్షన్ హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ కూడా ఇలా హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ని సంపాదించుకోవాలని ఉబలాటపడుతోంది. అందుకే ఈ బ్యూటి హీరోయిన్ గా తెలుగులో ప్రయత్నాలు జోరుగా సాగిస్తోంది. తండ్రి అర్జున్ కి ఉన్న పరిచయాలతో కూతురు టాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిలవ్వాలని సన్నాహాల్లో ఉంది. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలను కూడా ఐశ్వర్య కలిసి కొన్ని ఫొటోస్ షూట్స్ ని నిర్వహించిందని సమాచారం.

అయితే స్టార్ హీరో కూతురు అవ్వడం వల్ల ఐశ్వర్యకు కోలీవుడ్ లో లాగే టాలీవుడ్ లో వరుసగా ఛాన్స్ లు వస్తాయనుకున్నారు. కాని ఆమెను అటు తమిళ మేకర్స్ గాని ఇటు తెలుగు మేకర్స్ గాని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. స్టార్ కిడ్ అయినా కూడా ఐశ్వర్య మీద ఆసక్తి చూపించడం లేదట. అందుకే ఐశ్వర్య తెలుగులో ఎలాగన్న ఎంట్రీ ఇచ్చి సక్సస్ అవ్వాలని తెలుగు నేర్చుకుంటుందట. అయితే గ్లామర్ విషయంలో, హీరోలతో రొమాన్స్ విషయంలో, ఎక్స్‌ఫోజింగ్ విషయంలో ఐశ్వర్య కొన్ని హద్దులు పెట్టుకుందని అందుకే ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ మేకర్స్ ఐశ్వర్య ని అంతగా పట్టించుకోవటం లేదని అంటున్నారు. మరి స్టార్ కూతురైనా పాత్ర డిమాండ్ చేసినప్పుడు ఏదైనా చేయాల్సి ఉంటుంది. ఈ విషయం కూతురికి తెలీకపోయినా తండ్రికైతే తెలుసు కదా .. అంటున్నారు నెటిజెన్స్.

Read more RELATED
Recommended to you

Latest news