తెలంగాణాలో హైఅలెర్ట్…!

-

తెలంగాణాలో మరోసారి కరోనా వైరస్ నేపధ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్ణాటకకు చెందిన వ్యక్తి ఇక్కడ కరోనా చికిత్స చేయించుకున్న నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్ హెల్త్ డెస్క్ ద్వారా 57,214 మందికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు అధికారులు. ఒక్క రోజులోనే 3654 మందికి ఎయిర్ పోర్టు హెల్త్ డెస్క్ స్క్రీనింగ్ టెస్టులు చేసారు.

వారిలో వారిలో 736 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టెస్ట్‌లు చేయించుకున్నారు. కరోనా వైరస్ సోకినా వ్యక్తికి నయం అయింది. దీనితో అతన్ని గాంధీ ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేసారు. ఇక మరో ఇద్దరికీ కరోనా లక్షణాలు కనపడుతున్నాయి. దీనితో వారి నమూనాలను సేకరించారు అధికారులు. ప్రస్తుతం తెలంగాణాలో కరోనా లేకపోయినా సరిహద్దున ఉన్న కర్ణాటక లో ఉండటంతో అప్రమత్తంగా ఉన్నారు.

ఐటి ఉద్యోగులు ఎవరైనా విదేశాలకు వెళ్లి వచ్చారా అనే దాని మీద తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ ఆరా తీసి వారి వివరాలను సేకరించి పరిక్షలకు పిలవాలని నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో కరోనా రాదని తెలంగాణా ప్రభుత్వం కూడా అంచనా వేసింది. అనూహ్యంగా కరోనా ఎండలు ఎక్కువగానే ఉన్నా రావడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news