సరుకుల మధ్యలో శవం.. సూపర్ మార్కెట్‌లో వ్యాపారం..!

-

ఓ సూపర్ మార్కెట్‌లో జరిగిన సంఘటన చూస్తుంటే అసలు మానవత్వం అనేది బతికుందా అని అనిపిస్తుంది. సాధారణంగా ఎవరైనా మరణిస్తే వెంటనే వారి అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెడతారు. కానీ, బ్రెజిల్‌లోని కర్రెఫోర్ సూపర్ మార్కెట్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. ఆ సూపర్ మార్కెట్‌లో పని చేసే సేల్స్ మేనేజర్‌ మోయిసెస్ సంతోస్ కవాల్కంటే గుండె నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. అయితే అతడిని ఆసుపత్రికి తరలించకుండా స్టోర్‌ లోనే అత్యవసర చికిత్స అందించారు. పరిస్థితి కాస్త విషమించడంతో అతను మృతిచెందాడు. అయినాసరే యాజమాన్యం ఏ మాత్రం పట్టించుకోలేదు.

అతని కుటుంబానికి కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. పైగా అతని చావు తమ వ్యాపారానికి అడ్డం వస్తుందేమోనని భావించి ఆయన శవాన్ని ఒక మూలన పెట్టి చుట్టూ గొడుగులు, డబ్బాలు కప్పారు. ఈ దారుణమైన ఘటన గురించి తెలుసకున్న కొందరు దీన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్‌గా మారింది. దీంతో ఆ సూపర్ మార్కెట్ యాజమాన్యంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సూపర్ మార్కెట్ నిర్వాహకులు క్షమాపణలు తెలియజేశారు. అలాగే ఈ ఘటనపై సంతోస్ భార్య స్పందిస్తూ.. వీళ్లు మనుషులు కాదు. వీరికి డబ్బు సంపాదనే ముఖ్యం. వీరిలో అస్సలు మానవత్వమే లేదు అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news