చెస్‌లో మెరిసిన తెలంగాణ గ్రాండ్ మాస్టర్

-

తెలంగాణకు చెందిన పెద్ది రాహుల్ శ్రీవాత్సవ్ చెస్‌లో సత్తా చాటాడు. ఇటలీలోని కటోల్లికాలో జరుగుతున్న చెస్ ఫెస్టివల్-2022 టోర్నీలో తెలంగాణ యువకుడు సత్తా చాటాడు. ఈ మేరకు భారత 74వ గ్రాండ్ మాస్టర్‌గా అవతరించాడు. 19 ఏళ్ల రాహుల్ కటోలికా చెక్ క్రీడలో ప్రత్యర్థి లెవాన్ పంతులాయాతో జరిగిన 8వ రౌండ్ గేమ్‌ను డ్రా చేశాడు. గ్రాండ్ మాస్టర్ హోదాకు అవసరమైన 2,500 ఎల్లో లైవ్ రేటింగ్ మార్కును చేరుకున్నాడు.

రాహుల్ శ్రీవాత్సవ్
రాహుల్ శ్రీవాత్సవ్

100 మంది గ్రాండ్ మాస్టర్‌లను పొందేందుకు భారత్ మరో అడుగు ముందుకేసింది. ఎలైట్ క్లబ్‌లో మరొకరు చేరారు. తెలంగాణకు చెందిన రాహుల్ శ్రీవాత్సవ్ 74వ గ్రాండ్ మాస్టర్‌గా అవతరించాడు. దీంతో అతని కుటుంబసభ్యులు, కోచ్‌కు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడు సంజయ్ కపూర్ అభినందనలు తెలిపారు. కాగా, మేడ్చల్ జిల్లా కొంపల్లికి చెందిన పెద్ది రాహుల్ శ్రీవాత్సవ్.. ఈ ఏడాది జనవరిలోనే చెస్‌లో ఇంటర్నేషనల్ మాస్టర్‌గా అవతరించాడు. దీంతో తెలంగాణలోనే అతి పిన్న వయసులోనే ఘనత సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

Read more RELATED
Recommended to you

Latest news