ప్రతి ఒక్కరూ రెండు డోసులు తీసుకోవాల్సిందే : తెలంగాణ వైద్యశాఖ వార్నింగ్

-

ప్రతి ఒక్కరు రెండు డోసులు తీసుకోవాల్సిందేనని… రెండో డోస్‌ ను లైట్‌ తీసుకోవద్దని వార్నింగ్‌ ఇచ్చింది తెలంగాణ వైద్యశాఖ. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 69 లక్షల మంది ఇంకా ఒక్క డోస్ కూడా తీసుకోలేదని.. తెలంగాణా లో ఒకట్రెండు రోజుల్లో 3 కోట్ల డోసులు వాక్సినేషన్ పూర్తి కానుందని స్పష్టం చేసింది. 75 శాతం మందికి మొదటి డోస్ పూర్తయిందని… 39 శాతం రెండో డోస్ పూర్తయిందని వెల్లడించింది.

Covid vaccine booster shot | కోవిడ్ వ్యాక్సిన్ బూస్ట‌ర్ షాట్

50 లక్షల వాక్సిన్ నిల్వ తెలంగాణ లో ఉందని…. 0.4 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ అదుపులో ఉందని… వాక్సిన్ వల్ల కరోనా నుంచి 99 శాతం రక్షణ ఉంటుందని తెలిపింది.

రెండో డోస్ తీసుకోవాల్సిన వాళ్ళు 36 లక్షల మంది ఉన్నారని.. రష్యా, యూకే ల్లో కేసులు, మరణాలు పెరుగుతున్నాయని హెచ్చరించింది. వాక్సిన్ తీసుకోని వాళ్లలో 60 శాతం మందికి వైరస్ సోకుతుందని… ఒక్క డోస్ తీసుకున్న వాళ్లలో 30 శాతం మందికి కరోనా సోకుతుందని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరు రెండు డోసులు తీసుకోవాలని… కోవిడ్ లో హెర్డ్ ఇమ్యూనిటీ అనేది లేదని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news