తెలంగాణ ప్రభుత్వానికి, రాష్ట్ర ఉపాధ్యాయులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు స్టే విధించింది. బదిలీల నిబంధనలపై నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.
బదిలీల నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఉద్యోగ దంపతులు, యూనియన్ నేతలకు ఆదనపు పాయింట్లపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం బదిలీలపై మార్చి 14వ తేదీ వరకు స్టే విధిస్తూ కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.