వినాయక విగ్రహాల తయారీ దారులకు తెలంగాణ హైకోర్టు శుభవార్త చెప్పింది. అంతేకాకుండా వినాయక నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దన్న హైకోర్టు.. జీహెచ్ఎంసీ నీటి గుంటల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. పీవోపీ విగ్రహాల నిషేధంపై గతంలో కేంద్ర పీసీబీ మార్గదర్శకాలు జారీ చేసింది హైకోర్టు.
ఆ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.విగ్రహ తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. పీవోపీ విగ్రహాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఎలాంటి జీవో ఇవ్వలేదని తెలిపింది హైకోర్టు. విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థననూ తిరస్కరించింది. దుర్గాపూజపై పశ్చిమ్ బంగా మార్గదర్శకాలు పరిశీలించాలని సూచించింది హైకోర్టు.