తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేసింది. సమ్మక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారాంతవు సంతల్లో కోవిడ్ జాగ్రత్తలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. లగే ఈ నెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని ఆరా తీసింది హై కోర్టు. పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు ప్రభుత్వ న్యాయవాది. పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అటు ఆన్ లైన్ విచారణకు డీహెచ్ శ్రీనివాస్ రావు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతం గా ఉందని ఈ సందర్భంగా డీహెచ్ తెలిపారు. 77 లక్షల ఇళ్లల్లో జ్వరం చేసి 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామన్నారు డీహెచ్. కిట్లలో పిల్లల చికిత్స ఔషధాలు లేవన్నారు న్యాయవాదులు. పిల్లలకు మందులు కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదని వారికి సమాధానం ఇచ్చారు డీహెచ్. మూడు రోజుల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు.. కరోనా పరిస్థితులపై విచారణ ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.