ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణ రాజు వేసిన పిటీషన్ ను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర హై కోర్టు విచారణ చేసింది.
దీనిపై సీఎం జగన్ కు నోటీసులు జారీ చేసింది హై కోర్టు. సీఎం జగన్ పై 11 ఛార్జీషీట్లు ఉన్నాయని.. జగన్ బయట ఉంటే తన పదవిని అడ్డు పెట్టుకుని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటీషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధులపై కేసులను త్వరితగతిన ముగించాలని అన్నారు. జగన్ బెయిల్ రద్దు చేసి.. అన్ని ఛార్జీషీట్లపై విచారణ జరిపించాలని కోరారు. ఈ నేపథ్యలోనే… బెయిల్ రద్దు పిటిషన్ పై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది తెలంగాణ హై కోర్టు. తదుపరి విచారణ రెండు వారాలు వాయిదా వేసింది.