ఓమిక్రాన్ పై సీఎం జగన్ సమీక్ష… ఆంక్షలు అమలు చేయాలని అధికారులకు ఆదేశం…

-

కరోనా దేశవ్యాప్తంగా నెమ్మదిగా విస్తరిస్తోంది. తాజాగా నిన్న ఏపీలో మొదటి ఓమిక్రాన్ కేసు నమోదైంది. ఇటీవల ఐర్లాండ్ నుంచి ఏపీకి వచ్చిన 34 ఏళ్ల యువకుడికి ఓమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. దీంతో ఏపీలో మొదటి ఓమిక్రాన్ కేసు నమోదైంది.విజయనగరానికి వచ్చిన వ్యక్తికి ఓమిక్రాన్ పాజిటివ్ రావడం ఏపీ వాసుల్లో ఆందోళన కలిగించింది. దీనిపై అధికారులు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం ఓమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

తాజాగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఓమిక్రాన్ కేసు నమోదు అవ్వడంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షసమావేశం జరిపారు. రాష్ట్రంలో ఓమిక్రాన్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎయిర్ పోర్టుల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలన్నారు. రాష్ట్రంలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని అధికారులు జగన్ కు చెప్పారు. ఏపీలో ఫీవర్ సర్వే కొనసాగిస్తామని అధికారులు సీఎం జగన్ కు చెప్పారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగం చేయాలని అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news