వినాయక నిమజ్జనం ; తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

వినాయక నిమజ్జనం రివ్యూ పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టు లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు లో చుక్కెదురైంది. గతం లో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందేనని హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాల పై అభ్యంతరాలుంటే ఉత్తర్వులను ఛాలెంజ్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈ ఒక్క ఏడాది మినహయింపు ఇవ్వాలని కోరిం తెలంగాణ ప్రభుత్వం. గత ఏడాది లోనూ నిమజ్జనం పై ఉత్తర్వులు ఇచ్చినా, ఏడాది గడిచినా పాటించలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన అదేశాల్లో ఎలాంటి మార్పు లేదని స్ఫష్టం చేసింది హైకోర్టు. ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వులను యధావిధిగా కొనసాగించాలని, ఉత్తర్వులలో మార్పు లేదని తెలంగాణ హై కోర్టు స్పష్టం చేసింది.