ఏపీ ప్రభుత్వంపై ఆనందయ్య మరోసారి అసహనం

-

ప్రకాశం : కరోనా మందు తయారీకి సమాగ్రి లేక తయారీలో వెనుకబడ్డామని ఆనందయ్య అన్నారు. జిల్లాలో కరోనా మందును ఆయన పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వంపై ఆనందయ్య అసహనం వ్యక్తం చేశారు. మందు పంపిణీ కోసం ప్రభుత్వానికి లేఖ రాశానన్నారు. మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించక పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్డీ బంకుల్లో తన మందు అమ్ముతున్నారంటే అది ప్రభుత్వ లోపమేనన్నారు. అటు వంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో కరోనా మందు అందజేస్తున్నామని పేర్కొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అడిగిన వారందరికీ మందు అందిస్తున్నామని ఆనందయ్య స్పష్టం చేశారు.

మరోవైపు ఏపీ సచివాలయంలోనూ ఆనందయ్య మందు పంపిణీ చేశారు. చంద్రగిరి నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆనందయ్య మందును ఉద్యోగులకు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పంపిణీ చేశారు. సచివాలయంలో 2వేళా మందికి పంపిణీ చేస్తున్నారు. ఇంమ్యూనిటీ బుస్టర్ లాగా పని చేస్తోందని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు అందిస్తున్నామన్నారు. కరోనా కారణంగా చాలామంది ఉద్యోగులను కోల్పోయామని చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగుల భవిష్యత్ దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టామని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news