వివేకా హత్య కేసు.. గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు

-

వివేకా హత్య కేసులో కీలక పాత్ర వహించి గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గంగిరెడ్డి బెయిలు రద్దు వ్యవహారంలో సుప్రీంకోర్టు నుంచి బదిలీ అయిన సీబీఐ పిటిషన్‌పై గురువారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చిల్లకూరు సుమలత విచారణ చేపట్టారు. బెయిలు రద్దు కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ గంగిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు.

వివేకా హత్య కేసులో గంగిరెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి ఇతర నిందితులు సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దస్తగిరిలు వివేకా ఇంట్లోకి రావడానికి గంగిరెడ్డి సహకరించారని తెలిపింది. గంగిరెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, వారి సన్నిహితులు 15న ఉదయం వివేకా ఇంటికి వెళ్లారని, వివేకా గుండెపోటుతో మృతి చెందారన్న ప్రచారం చేయడంలో భాగస్వాములుగా ఉన్నారని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news