బిగ్ బాస్ 5 లిస్ట్‌ : తెలంగాణ యాంక‌ర్ మిస్సింగబ్బా

-

తెలుగు టెలివిజన్లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోగా బిగ్ బాస్ ని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా బిగ్ బాస్ 5 (Bigg Boss 5) తెలుగు ప్రోమో విడుద‌లైంది త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 5 లో కంటెస్టెంట్లుగా ఎవరెవరు రాబోతున్నారన్న విషయంలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. యాంకర్ రవి బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా వస్తున్నాడని వార్తలు వచ్చాయి.

Bigg Boss 5 Telugu | బిగ్ బాస్ 5 తెలుగు
Bigg Boss 5 Telugu | బిగ్ బాస్ 5 తెలుగు

అదలా ఉంచితే, ప్ర‌తీ సీజ‌న్లో తెలంగాణ యాంక‌ర్ల‌కు పెద్ద పీట వేసింది బిగ్ బాస్ టీమ్. ఇప్ప‌టి వ‌ర‌కు తెలిసిన‌ స‌మాచారం మేర‌కు తెలంగాణ యాంకర్ కు చోటు లేన‌ట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ నుండి చూసుకుంటే మీడియాకి సంబంధించి వివిధ రకాల వృత్తుల్లో ఉన్నవారిని కంటెస్టెంట్లుగా తీసుకున్నారు. అందులో తెలంగాణ యాసలో యాంకరింగ్ చేసేవారు కూడా ఉన్నారు. మొదటి సీజన్లో కత్తి కార్తీక, రెండవ సీజన్లో భానుశ్రీ, మూడవ సీజన్లో శివజ్యోతి, నాలుగవ సీజన్లో సుజాత కనిపించారు. ప్రస్తుతం ఐదవ సీజన్లో తెలంగాణ యాసలో ప‌ల‌క‌రించే యాంక‌ర్ లేక‌పోయినా.. తెలంగాణ‌లో దంచి కొట్టే లోబోను బిగ్‌బాస్ 5 కి సెలెక్ట్ చేసిన‌ట్లు స‌మాచారం.

ప్ర‌తీసారి రొటీన్‌గా ఉండ‌కూడ‌ద‌నుకున్నారో లేక ఆప్ష‌న్ దొర‌క‌లేదో మ‌రి. కాకపోతే ఇప్ప‌టి వ‌ర‌కు బిగ్ బాస్ కంటెస్టంట్స్ లిస్ట్ అంటూ సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న లిస్ట్ ఎంతవరకు నిజమనేది బిగ్ బాస్ మొదలయితే కానీ తెలియదు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఈ లిస్ట్ దాదాపుగా ఫైన‌ల్ అని.

  • యాంకర్ రవి
  • లోబో
  • ఈషా చావ్ల‌
  • మాన‌స్
  • సిరి హ‌నుమంత్‌
  • యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్
  • ప్రియంక‌
  • వ‌ర్షిణి
  • సిరియ‌ల్ యాక్ట‌ర్ స‌న్నీ
  • అనితా లంబ (అన్నీ మాస్ట‌ర్‌)
  • కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ఉమ‌
  • ల‌హ‌రి శారి ( ల‌హ‌రి శ‌ర్మ‌)
  • న‌వ్య స్వామి
  • నిఖిల్ విజ‌యేంద్ర సింహా ( nikhiluuuuuuuuu )
  • జ‌శ్వంత్
  • కాజ‌ల్‌
  • శ్వేత‌
  • ప్రియాంక సింగ్‌
  • జ్యోతి
  • ప్రియంక‌

Read more RELATED
Recommended to you

Latest news