విద్యుత్‌ ఉత్పత్తిలో ఇండియాలోనే నంబర్‌ 1 గా తెలంగాణ రికార్డు

-

తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా ఆవిర్భవించిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్ రంగంలో సమూలమైన మార్పులు తేవడం వల్లనే ఈ అద్భుతమైన విజయం సాధ్యమైందని వెల్లడించింది. తలసరి విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొంది.

2014 లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం, 1,110 యూనిట్లు కాగా, ప్రస్తుతం 2,012 యూనిట్లకు పెరిగింది. కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకు ఎక్కింది. రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ప్రభుత్వం తెలియజేసింది.

రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు ఉండగా, ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా నేడు తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 17,305 మెగావాట్లకు చేరుకుంది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news