ఢిల్లీకి మరోసారి కేంద్రమంత్రుల బృందం..కారణం ఇదే..!

వరి ధాన్యం కొనుగోళ్ల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ నువ్వా నేనా అనుకుంటూనే ఉన్నాయి. కేంద్రం రాష్ట్ర సర్కార్ ను విమర్శిస్తుంటే. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఎంపీలు వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ పార్లమెంట్ లో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు పై కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

ఇందులో భాగంగా మంత్రుల బృందం మరోసారి ఢిల్లీకి వెళ్లనుంది. మంత్రి నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, దయాకర్ రావు, కమలాకర్, ప్రశాంత్ రెడ్డి తో పాటు ఎంపీలు సైతం ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు ప్రధాని మోడీ కేంద్ర మంత్రి పియిష్ గోయల్ అపాయింట్ మెంట్ కోసం వారు ఎదురుచూస్తున్నారు.