జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్… ఒక ఉగ్రవాది హతం..

కాశ్మీర్ లో మరోసారి ఎన్ కౌంటర్ చోటు  చేసుకుంది. ఉగ్రవాదాలు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంలో గాలింపు చోస్తున్న సమయంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు శ్రీనగర్ శివార్లలోని హర్వాన్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుందని… ఇందులో ఒక ఉగ్రవాదిని హతమార్చామని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. హతమర్చిన ఉగ్రవాదిని లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదిగా గుర్తించారు. ప్రస్తుతం ఎన్ కౌంటర్ చోటు చేసుకున్న ప్రదేశాన్ని అదుపులోకి తీసుకుని.. భద్రతా బలగాలు, పోలీసులు గాలింపును చేపట్టారు.

కాగా ఇటీవల కాలంగా జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో వరసగా ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఉగ్రవాదం చాపకింద నీరులా జమ్మూ కాశ్మీర్ లో  పెరగుతుండటంతో భద్రత బలగాలు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో వారానికి రెండు మూడు ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి.