ఏపీలో కరోనా కలకలం… విదేశాల నుంచి వచ్చిన వారిలో 27 మందికి కరోనా…

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కల్లోలం కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ తక్కవ కాలంలోనే 90కి పైగా దేశాలకు పాకింది. ఇండియాలో కూడా ప్రస్తుతం 145 కేసులు నమోదయ్యాయి. గత మూడు రోజుల్లో కేసుల సంఖ్య డబుల్ కావడం ఇది ఎంత వేగంగా విస్తరింస్తోందో తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో ఇప్పటికే ఓమిక్రాన్ కేసుల సంఖ్య 20కి చేరింది.

ఇదిలా ఉంటే ఏపీలో కరోనా కలకలం మొదలైంది. ఇప్పటికే ఆరాష్ట్రంలో ఒక ఓమిక్రాన్ కేసు నమోదైంది. ఇప్పుడు మరికొన్ని కేసులు వస్తాయా… అనే ఆందోళన మొదలైంది. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన 27 మంది ప్రయాణికులకు కరోనా సోకింది. అయితే ఇది ఓమిక్రానా.. కాదా అని జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టుల్లో తేలనుంది. అయితే వీరితో సన్నిహితంగా ఉన్న 9 మందికి కూడా కరోనా సోకింది. తొలిసారిగా కోవిడ్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చి తరువాత పాజిటివ్ వచ్చిన వారిలో 8 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. కాగా ఏపీకి ఇప్పటి వరకు విదేశాల నుంచి 26 వేల మంది వచ్చారని… వీరిలో వెయ్యి మంది ఆచూకీ తెలియకపోవడంతో అధికారులు ఆరా తీస్తున్నారు.