తెలంగాణ ఎమ్మెల్యేల కోసం..లగ్జరీ అపార్ట్ మెంట్స్..

దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు నూతన భవన సముదాయాన్ని నిర్మించింది.  హైదర్‌గూడ ప్రాంతంలో 4.5 ఎకరాల విస్తీర్ణంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ని రూ.166 కోట్లతో నిర్మించారు. మొత్తం 12 అంతస్తుల్లో ఎమ్మెల్యేలతోపాటు వారి సిబ్బంది ఉండేదుకు  వీలుగా ఒక్కో ఎమ్మెల్యే నివాసం 2400 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపొందించారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అపార్ట్ మెంట్ల సముదాయాన్నిమంగళవారం సందర్శించారు.

అత్యాధునిక నిర్మాణ శైలితో పాటు జిమ్, కమర్షియల్ కాంప్లెక్స్, ఇతర వసతులను కల్పించారు. ఎమ్మెల్యేలను కలిసేందుకు వచ్చిన వారికి గెస్ట్ రూంతో పాటు, ఆఫీస్ రూం, డ్రాయింగ్ రూం, విశాలమైన డైనింగ్ హాల్, చుట్టూ గ్రీనరీని ఏర్పాటు చేశారు. ఈ భవన సముదాయాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. పక్క రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు సైతం ఈ క్వార్టర్స్ ని చూసి అసుయ పడుతున్నారంటే.. అవి ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిపోతుంది కదా.