తెలంగాణ ఉద్యమానికి చ‌రిత్ర ఉంది : సీఎం కేసీఆర్‌

-

కేసీఆర్ నాగర్ కర్నూలు పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ను, ఎస్పీ కార్యాలయాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించారు. అనంతరం ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు. ఒకప్పుడు పాలమూరు ప్రజలు ముంబయి బస్సులను పట్టుకొని వలస పోయేవారని, ఇప్పుడు పరిస్థితి మారిపోయి అద్భుతమైన ఫలితాలను చూస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పాలమూరు జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని సీఎం సూచించారు. కేసీఆర్ నాగర్ కర్నూలు పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ను, ఎస్పీ కార్యాలయాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించారు. అనంతరం ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడారు.

తెలంగాణ రాక‌పోయి ఉంటే నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కాక‌పోయేది. ఎస్పీ, క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాలు వ‌చ్చేది కాదు. అద్భుతంగా ఈ భ‌వ‌న‌నాలు రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ ఉద్య‌మానికి చ‌రిత్ర ఉంది. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో చాలా వెనుక‌బాటు త‌నం ఉంది. ఇబ్బందులు ఉన్నాయి. సాగు, తాగునీటికి , క‌రెంట్‌కు ఇబ్బంది ప‌డుతున్నారు. ఇవ‌న్నీ అర్థం కావాలంటే పాల‌మూరు ఎంపీగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాను. జ‌య‌శంక‌ర్ సార్ సూచ‌న మేర‌కు పాల‌మూరు ఎంపీగా పోటీ చేసి గెలుపొందాను. ఆ రోజు వాస్త‌వంగా పాల‌మూరు జిల్లాలో ఉద్య‌మం బ‌లంగా లేకుండే. కానీ మీరు చూపించిన ఆద‌ర‌ణ‌తో ఎంపీగా గెలిపించారు. ఉద్య‌మ చ‌రిత్ర‌లో పాల‌మూరు జిల్లా పేరు శాశ్వ‌తంగా ఉంటుంది. ఈ జిల్లా ఎంపీగా ఉంటూనే ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించాను. ఈ జిల్లాను ఎప్ప‌టికీ మ‌రిచిపోను అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version