తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు ! అంతలోనే ట్విస్ట్?

-

తెలంగాణాలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంగతి తెలిసిందే. ఒక సంవత్సరం ముందు కూడా ఎవ్వరూ కాంగ్రెస్ గెలుస్తుందని అస్సలు ఊహించలేదు, కానీ ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి నడుంకట్టి నేతలను అందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి కాంగ్రెస్ ను అధియక్రంలో ఉన్న BRS తో ఢీకొట్టి విజయాన్ని అందించాడు. అందుకే కాంగ్రెస్ అధిష్టానం సైతం అతని శ్రమను గుర్తించి సీఎంను చేసింది. ఈ రోజు తెలంగాణ రెండవ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, అతనితో పాటు 11 మంది మంత్రులు సైతం ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాగా కాసేపటి క్రితం అందిన సమాచారం మేరకు ఈ 11 మంది మంత్రులకు శాఖలను కేటాయించినట్లు వచ్చిన వార్తలను ప్రభుత్వ వర్గాలు పూర్తిగా ఖండిస్తున్నారు.

ఇవనీ అవాస్తవం అని ఎవ్వరికీ ఇంకా శాఖలను కేటాయించలేదని.. రేవంత్ రెడ్డి కి అధిష్టానం నుండి సమాచారం అందిన తర్వాతనే కేటాయింపులు ఉంటాయంటూ ట్విస్ట్ ఇచ్చారు. మరి ఎవరెవరికి ఎటువంటి శాఖలు ఇస్తారనేది ఉత్కంఠగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news