ప్రస్తుతం ఏపీలోని పసరు మందు వైద్యుడు ఆనందయ్య కనిపెట్టిన కరోనా పసరు మందు వైరల్ అవుతున్న తరుణంలో తెలంగాణకు చెందిన మరో వ్యక్తి కూడా కరోనా మందును కనిపెట్టాడు. దీన్ని ఆవుపేడ పొగ ద్వారా తయారు చేశాడు. దీని వల్ల కరోనా ఖతం అవ్వడంతో పాటు ఆక్సిజన్ లెవల్స్ కూడా పెంచుతోందట. స్వయానా పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు దీన్ని ప్రారంభించారు. ఆ వివరాలు తెలుసుకుందాం. మంథనికి చెందిన గోశాల నిర్వహకుడు రమేష్ ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ఆవు పేడ పొగతో సృష్టించిన మందు పీల్చుకోవచం వల్ల కరోనా వైరస్‌ను అంతం చేయడంతో పాటు ఆక్సిజన్ లెవల్ పెంచుకోవచ్చంటున్నారు.
ఆవుల నుంచి సేకరించిన పేడ పిడకలను నెయ్యి, పసుపు, ఆవాలు, కర్పూరం వేసి కాల్చడం వల్ల వచ్చే పొగతో వైరస్ అంతం అవుతుందట. ప్రతి రోజు రెండు గంటల పాటు ఇలా పొగ పెడితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఈ ప్రయోగం బాగుందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గోశాల నిర్వాహకులను అభినందించారు. సాధారణంగా ప్రతి మంగళవారమో, శుక్రవారమో అందరి ఇళ్లలో ఆవు పేడ పిడకతో ధూపం వేసుకుంటే ఆ ఇంటికి శుభం కలుగుతుంది. పరిసరాల్లో ఉన్న దోమలు, ఇతర బాక్టిరియా కూడా నాశనమవుతుందని పెద్దలు చెబుతారు. ఈ నేపథ్యంలో కరోనా మందు కూడా ఆవు పేడ పిడకతో తయారు చేశారు. ఈ మందు ప్రభావం ఎంత ఉంటుందో, ఏమో ఇంకా తెలియాల్సి ఉంది. దాన్ని ప్రభుత్వం ఏమాత్రం ఆమోదిస్తోందో కూడా తెలియదు. అయినా, ఇలాంటి ప్రకృతి సిద్ధమైన మందులు ఒకింత మంచినే చేస్తాయి. దీన్ని ధూపం వేసుకున్న ఇందులో సహజసిద్ధమైన మందులే వాడారు కాబట్టి అవి హానికరం కూడా కాదు కదా!