లోన్ యాప్ దందా : కేంద్ర హోం, ఐటీ శాఖలకు తెలంగాణ పోలీసుల లేఖలు !

-

తెలంగాణ ఆన్ లైన్ లోన్ యాప్స్ కేసులో పోలీసులు విచారణ కొనసాగుతోంది. ఆన్ లైన్ లోన్ యాప్స్ ను రూపొందించిన యువకుడిని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు, నాలుగు నెలల నుండి యాప్ ల ద్వారా సదరు యువకుడు రుణాలు ఇస్తున్నట్టు గుర్తించారు. ఆయన డబ్బులు వసూలు చేసేందుకు ఒక రికవరీ ఏజెంట్స్ బ్యాచ్ ని ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు. ఇక డబ్బులు కట్టడం కనుక ఆలస్యమైతే మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు ఈ ఏజెంట్ల బ్యాచ్.

మైక్రో ఫైనాన్స్ యాప్ లో లోన్ తీసుకున్న భాదితులు తీసుకున్న అమౌంట్ కి 50 % పైన వడ్డీ చెల్లించినట్లు భాదితులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఆన్ లైన్ లోన్ యాప్స్ కాల్ మనీ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న పోలీసులు  యాప్ లను కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అందుతున్న సమాచారం మేరకు కాల్ మనీ యాప్ లు నిషేధించాలని కేంద్ర హోం శాఖ, ఐటీ శాఖ లకు తెలంగాణ పోలీస్ శాఖ లేఖ కూడా రాసినట్టు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news