విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ రికార్డు..చరిత్రలో తొలిసారి భారీగా పెరిగిన డిమాండ్‌

-

విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ రికార్డు సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ 12 గంటలకు 14649 మెగా వాట్ల ఫీక్ డిమాండ్ నమోదు అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగం ఇదే మొదటిసారి కావడం విశేషం. నిన్న 14169 మెగా వాట్ల విద్యుత్ వినియోగం నమోదు కాగా ఇవాళ అంతకు మించి 14649 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు అయింది.

విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మొత్తం వినియోగంలో 37 శాతం వ్యవసాయ రంగంకే వాడుకలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ వినియోగం 6666 మెగా వాట్లు మాత్రమే. రానున్న రోజుల్లో 15 వేల మెగా వాట్ల విద్యుత్ వినియోగం నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎంత డిమాండ్ వచ్చిన నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news