శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ నిలిపివేయండి.. KRMBకి తెలంగాణ లేఖ

-

శ్రీశైలం ప్రాజెక్టులో జలవిద్యుత్​ను వెంటనే నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ లేఖ రాసింది.‘‘’శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు అడుగంటాయి. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నాయి. దీనివల్ల ప్రాజెక్టు కింద తాగు, సాగునీటి అవసరాలకు ఇబ్బంది ఏర్పడనుంది. వెంటనే ఉత్పత్తిని నిలిపివేసేలా చర్యలు తీసుకోండి’’’అని బోర్డుకు విజ్ఞప్తి చేసింది.

‘శ్రీశైలం జలాశయం నుంచి నీటి వినియోగం అధికంగా ఉన్నందున రానున్న వేసవిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాగు, సాగేతర వినియోగాన్ని అడ్డుకోవాలి. కృష్ణా జలాల్లో ఏపీ ఇప్పటికే ఎక్కువ నీటిని వినియోగించుకుంది. కేటాయింపుల ప్రకారం ఏపీకి 615.17 టీఎంసీలు (66 శాతం), తెలంగాణకు 316.90 టీఎంసీల (34 శాతం) వాటా ఉంది.

గత నెల 25వ తేదీ తెలంగాణ 183.05 టీఎంసీలు వినియోగించుకోగా రాష్ట్రం పరిధిలోని ప్రాజెక్టుల్లో 10.20 టీఎంసీలు ఉంది. మొత్తం వాటాలో ఏపీకి ఉన్న మిగులు 13.03 టీఎంసీలు, తెలంగాణకు ఉన్న మిగులు 123.63 టీఎంసీలు’’అని ఆ లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news