రైస్ మిల్లుల్లో ఎఫ్ సీ ఐ తనిఖీలు ఆపాలి… మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్

-

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లల్లో ఎఫ్ సీ ఐ తనిఖీలు చేస్తోంది. ధాన్యం నిల్వలపై ఆరా తీస్తున్నారు. 60 టీములుగా ఏర్పడి రాష్ట్రంలో ఉన్న అన్ని మిల్లల్లో తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ తనిఖీలపై పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ మిల్లల్లో ఉద్దేశపూర్వకంగానే ఎఫ్ సీ ఐ తనిఖీలు చేపడుతోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు  కేంద్రం ఇలా చేస్తుందని ఆయన ఆరోపించారు. రైతుల పంట రైస్ మిల్లులకు చేరకూడదు, కొనుగోళ్లు సజావుగా సాగకూడదని కేంద్రం భావిస్తున్నారు. దీని వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతారని.. తనిఖీలు ఆపి కొనుగోళ్లు పూర్తయ్యాక ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని కోరుతున్నాం అని గంగుల అన్నారు. ఇటీవల కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ధాన్యం సేకరణ గురించి ప్రస్తావిస్తూ… ధాన్యం కొనుగోలు విషయంలో పలు రైస్ మిల్లలు అవకతవకలకు పాల్పడ్డాయని ఆరోపించారు. అవకతవకలను తేల్చేందుకు ఎఫ్ సీ ఐ అధికారులకు తనిఖీలు చేయాలని ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news