ఉద్యమకారులే కేసీఆర్ కు అండగా ఉండాలి: ఎంపీ

తెలంగాణ భవన్ లో తెలంగాణ రాష్ట్ర అవిర్భావ వేడుకలు జరిగాయి. జాతీయ జెండా ఆవిష్కరించిన సెక్రటరీ జనరల్ డాక్టర్ కె .కేశవ రావు తర్వాత కీలక వ్యాఖ్యలు చేసారు. లోక్ సభ లో టీ ఆర్ ఎస్ నేత నామా నాగేశ్వర్రావు ,రాజ్య సభ సభ్యుడు కె .ఆర్ .సురేష్ రెడ్డి హాజరు అయ్యారు. ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ సాధించాం అని అన్నారు. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామో అంతకన్నా ఎక్కువ సాధించాం అని ఆయన వెల్లడించారు.

బడుగు, బలహీన వర్గాల సక్షేమం కోసం 50 వేల కోట్ల రూపాయలు పైనే ఖర్చు చేస్తున్నాం అని ఈ సందర్భంగా వివరించారు. కోటి ఎకరాల మాగాణి గా తెలంగాణ ను చేసే దిశగా ప్రయత్నాలు నడుస్తున్నాయి అని ఆయన తెలిపారు. తిరిగి చూస్తే గర్వపడే విధంగా అభివృద్ధి చెందింది అన్నారు. ఉద్యమ కారులు లేకపోతే తెలంగాణ లేదు.. వాళ్లకు మనం సెల్యూట్ చేయవలసిన అవసరం ఉందన్నారు. ప్రజలు, ఉద్యమకారులు కేసీఆర్ కు అండగా ఉండి తెలంగాణ అభివృధి సాధించాలి అని కోరారు.