జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలు..

-

నేడు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్‌ జులై సెషన్‌ పేపర్‌-1 ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. జాతీయ స్థాయిలో మొత్తం 24 మంది విద్యార్థులు వంద పర్సంటైల్‌ సాధించారు. వారిలో తెలంగాణకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఉండటం విశేషం. రూపేశ్‌ బియానీ, ధీరజ్‌ కురుకుంద, జాస్తి యశ్వంత్‌, బూస శివనాగ వెంకట ఆదిత్య, అనికేత్‌ ఛతోపాధ్యాయ్‌ వంద పర్సంటైల్‌ సాధించారు.

Boys fare well in class 12 CBSE results

వారిలో ధీరజ్‌ కురుకుంద స్టేట్‌ టాపర్‌గా నిలిచాడు. చందా మౌమిత (99.98 పర్సంటైల్‌) అమ్మాయిల విభాగంలో స్టేట్‌ టాపర్‌గా నిలిచింది. ఇక జనరల్‌ కేటగిరీ రూపేశ్‌ బియానీ రాష్ట్రస్థాయిలో టాప్‌ ప్లేస్‌లో ఉండగా, జాస్తి యశ్వంత్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఎస్సీ కేటగిరిలో కరకర జశ్వంత్‌ (99.9844822), ఎస్టీ కేటగిరిలో మాలోతు విశాల్‌ నాయక్ (99.834471)‌, పీడబ్ల్యూడీ విభాగంలో గైకోటి విగ్నేశ్‌ (99.8703166) అగ్రస్థానంలో ఉన్నారు. అయితే.. టాపర్లుగా నిలిచిన విద్యార్థులు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news