వేసవికాలం రాగానే పసిపిల్లలు మరియు వృద్దులు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. ఎందుకంటే ఈ కాలంలో ఎక్కువగా ఎండలు ఉండడం వలన పిల్లలను ఎండలో తిప్పడం మరియు వృద్దులు ఎండలోకి వెళ్లడం చేయకూడదని చెబుతారు. అయితే ప్రస్తుతం ఉన్న ఎండలు అందరినీ ఎంతగానో ఇబ్బంది పెట్టేవిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఇప్పటికే వడగాలులతో కూడిన ఎండలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంటే.. తాజాగా పక్క రాష్ట్రం అయిన తెలంగాణలోనూ ఈ తరహా ఎండలు వస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మాములుగా నమోదు అయ్యే ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువగా నమోదు అవుతున్నాయట. తెలుస్తున్న సమాచారం ప్రకారం చాలా చోట్ల 40 డిగ్రీలు దాటుతున్నాయి. నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్ 42 .8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండాలని హైద్రాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.