ఏప్రిల్‌ మొదటి వారంలో తెలంగాణ టెన్త్‌ పరీక్షలు !

-

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ నిన్న విడుదల అయిన సంగతి తెలిసిందే. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వరకు ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జరగనున్నాయి. కాగా, తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

ఇంటర్ ప్రధాన పరీక్షలు మార్చిలోనే ముగియనుండగా, ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ పరీక్షలను ప్రారంభించాలని ఎస్ఎస్సి బోర్డు అధికారులు భావిస్తున్నారు. 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకే పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించగా, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన జీవోను ప్రభుత్వం జారీ చేయాల్సి ఉంది. ఈ జీవో జారీ అయితేనే తుది షెడ్యూల్ ఖరారు చేస్తామని ఓ ఉన్నత అధికారి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news